Sunday, March 4, 2012

భారత వర్షము  సృష్టికి సంస్కృతికి సనాతన ధర్మానికి మూలమైనది. భూగోళానికి ఉత్తరార్థ సగ భాగానికి జంబూ ద్వీపమని దక్షిణార్థ గోళములో ఆరు ద్వీపములు కలసి సప్త ద్వీపములుగా ఒప్పి వున్నది. జంబూద్వీపము తొమ్మిది వర్షములతో విస్తరిచి వున్నది. 
   ఆదిమధ్యంతరహితుడు సృష్టి టిభేట్టు పీటభూమిలో జరిపినాడని ప్రతీతి. సమస్త మానవ, రాక్షస, దేవ జాతులు, సమస్త పక్షి, జంతు, క్రిమికీటకాదులు సృష్టి జరిపిన పిమ్మట వేద విజ్ఞ్యానాన్నిభారత వర్షంలో విలసిల్లింది. వేదాలు ఋషులు యోగులు పవిత్ర నదులు పర్వతాలు సమస్త దేవతల ఆవిర్భావ క్షేత్రాలు, సాక్షాత్తు భగవంతుడే జన్మించిన వర్షము (దేశము) పుణ్యభూమి అనాదిగా పేరుపొందింది. భారత వర్ష మానవ జాతి బాష సంస్కృత బాష (దేవ బాష). సత్సంప్రదాయం నియమనిబందనలు నిత్య భగవత్ సేవలు పంచ మహా యజ్ఞములు నిత్య హోమాలు పాటించ వీలుకాని మానవ జాతి జంబూద్వీపం లోని మిగతా ఆరు వర్శములలో విస్తరించినారని ప్రస్తుత చరిత్రకారులు చెబుతున్నారు. సంస్కృతం ప్రపంచ  బాషలన్నిటికి మాతృ బాషగా నేటి బాష ప్రవీణులు చెబుతున్నారు. ఈ విషయము శాస్త్రీయంగా రుజువు చేయవచ్చును. 
 జంబూద్వీపంలో  
                                         
                        ఉత్తర ధృవాన  1 .  ఇలావృత వర్షం  మధ్యన మేరు పర్వతం (తలక్రిందులైన శంకువు రూపము)  
                           ఉత్తర దిశగా  2.  రమ్యక వర్షం
                                              3. హిరణ్యక వర్షం
                                              4 . కురు వర్షం

                         దక్షిణ దిశగా   5 . హరి వర్షం
                                              6  కింపురుష వర్షం
                                              7 . భారత వర్షం 

                       పశ్చిమ దిశగా  8 . కేతుమాల వర్షం

                      తూర్పు దిశగా   9 . భద్రాశ్వ  వర్షం 

ఇందు భారత వర్షము పుణ్య భూమిగా 
                                కర్మభూమిగా 
                                వేద భూమిగా
                                యోగ భూమిగా 
 సృష్టి ఆది నుంచి కీర్తింపబడుతున్నది. మిగిలిన వర్షములన్ని భోగ భూములుగా వర్ణింపబడినవి. అనగా ఏదేని కార్యర్ది అయి భారత వర్ష మందు నివసించు వారు ఇతర వర్శములకు వెళ్ళినా తిరిగి వచ్చినచో తమ దివ్యత్వము కోల్పోయిన కారణమున మరల పుణ్య తీర్ధములను దర్శించి ఉపనయనము గావిన్చుకోనవలేనని ప్రతీతి.  
    వేద జ్ఞ్యనము పొందటానికి  సమస్త మానవ జాతికి అధికారము వున్నదని వేదము చెబుతున్నది. 

No comments:

Post a Comment